Telangana: తెలంగాణ డీజీపీకి షాకిచ్చిన కేటుగాళ్లు, ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టి ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు, అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు

అమాయకులకు మాయమాటలు చెప్పి సులువుగా బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటుగాళ్లు తెలంగాణ పోలీసు బాస్‌ను టార్గెట్‌ చేశారు.

Telangana: తెలంగాణ డీజీపీకి షాకిచ్చిన కేటుగాళ్లు, ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టి ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు, అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు
Telangana DGP Mahender Reddy (File photo)

Hyd, June 28: అమాయకులకు మాయమాటలు చెప్పి సులువుగా బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటుగాళ్లు తెలంగాణ పోలీసు బాస్‌ను టార్గెట్‌ చేశారు. ఒక వాట్సాప్‌ నంబర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా (DGP M Mahendar Reddy DP) పెట్టి ఏకంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులకే సందేశాలు పంపించారు. ‘అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది. తొందరగా పంపండి. కొద్ది రోజుల్లో తిరిగి పంపిస్తా’ అంటూ మేసేజ్‌లు చేశారు. ఈ విషయాన్ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి (DGP M Mahendar Reddy) దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు

అప్రమత్తమైన ఆయన.. ఎవరూ డబ్బులు పంపించవద్దని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను (Cyber crime police of Hyderabad) ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీజీపీ మహేందర్‌రెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, తదితర సోషల్‌ మీడియా ఖాతాలున్నాయి. అందులో పోలీసు శాఖకు సంబంధించిన విషయాలను ఆయన పోస్టు చేస్తుంటారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఒక వాట్సాప్‌ నంబర్‌కు డీపీగా సైబర్‌ నేరగాళ్లు పెట్టారు. అలాగే, పోలీసు శాఖకు చెందిన వెబ్‌సైట్‌లలో ఉన్నతాధికారుల ఫోన్‌ నంబర్లను సేకరించి సందేశాలు పంపించారు.

(The above story first appeared on LatestLY on Jun 28, 2022 02:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).