Hyderabad, April 07: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ (MODI Hyderabad tour) పర్యటనకు రానున్నారు. అధికారిక పర్యటన కావడం, తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్స కార్యక్రమాలు ఉండటంతో మోదీ టూర్ (Modi Tour) లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం కూడా కేటాయించింది. కానీ, సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ను పాటించలేదని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపించారు.
కానీ, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పీఎంవో ఆహ్వానం పంపినా.. ఏ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనబోరని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ను పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
కానీ, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పీఎంవో ఆహ్వానం పంపినా.. ఏ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనబోరని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు.