Hyderabad, April 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- మోనప్ప జంక్షన్
- టివోలి జంక్షన్
- సెయింట్ జాన్ రోటరీ
- సంగీత్ క్రాస్ రోడ్
- చిలకలగూడ జంక్షన్
- ఎంజీ రోడ్
- ఆర్‌పీరోడ్
- ఎస్పీ రోడ్
ఈ మార్గాల్లో కూడా..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నేరుగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించొద్దని ప్రయాణికులకు పోలీసులు సూచించారు. టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్‌బీఎస్ క్రాస్‌రోడ్‌ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.