Telangana Cricketer Dies: బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి, తెలంగాణలో విషాదకర ఘటన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్‌(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మరణించాడు.

Telangana Cricketer Dies: బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి, తెలంగాణలో విషాదకర ఘటన
Representational Image (Photo- Wikimedia Commons)

Cricketer Dies Due to Heart Attack : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్‌(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మరణించాడు.చిగురుమామిడి మండలానికి చెందిన ఆంజనేయులు(37) క్రికెట్ టోర్నమెంట్‎లో బౌలింగ్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దేశంలో కరోనా కేసులు పెరగడానికి XBB1.16 వేరియంటే కారణం, దీని లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న నిపుణులు

యువకుడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం. తోటి ఆటగాళ్లు ఆస్పత్రికి తరలించే క్రమంలో అప్పటికి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Apr 07, 2023 05:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).