Telangana Election Results 2023: తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌, అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం, కొనసాగుతున్న కౌంటింగ్

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లును కైవసం చేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తన సమీప ప్రత్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు.

Telangana Election Results 2023: తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌, అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం, కొనసాగుతున్న కౌంటింగ్
Telangana-Exit-Poll-Results-2023

Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లును కైవసం చేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తన సమీప ప్రత్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు. అలాగే ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్‌ విజయం నమోదు చేసింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు.

సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు 5,758 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,497 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,515 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆరు రౌండ్లలో కలిపి హరీశ్‌ రావు 28,495 ఓట్లతో ముందంజలో ఉన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్‌ కౌంటింగ్ ముగిసే సరికి జగదీష్‌రెడ్డి 4,573 ఓట్ల ముందంజలో ఉన్నారు. 7వ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 2,288, కాంగ్రెస్‌ 2,081, బీజేపీ 2,942 ఓట్లు ఓట్లు వచ్చాయి.

తెలంగాణలో గెలుపు దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేల తరలింపు కోసం తాజ్ కృష్ణలో సిద్ధంగా ట్రావెల్స్ బస్సులు.. వీడియోతో

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 10వ రౌండ్‌ ముగిసే సరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి 6,395 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొత్తం పది రౌండ్లలో కలిపి సబితా ఇంద్రారెడ్డికి 54,610 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 48,215 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి 29,971కి ఓట్లు పోలయ్యాయి. కొల్లాపూర్ లో బర్రెలక్కకు 1200 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌంటింగ్‌ కొనసాగుతోంది.

హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్న హైదరాబాద్ లో ఇప్పటి వరకు 5 నుంచి 8 స్థానాలో పూర్తి ఆధిపత్యం దిశగా కొనసాగుతోంది. దీంతో పాటు రంగారెడ్డిలోనూ కారు దూసుకెళ్తోంది. 14 స్థానాలున్న రంగారెడ్డిలో మెజారిటీ దిశగా దాదాపు 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ దే హవా

ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 13,000 లీడ్

ఖానాపూర్‌లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు

హుజూరాబాద్‌లో ఆరో రౌండ్‌ ముగిసేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి లీడ్‌

మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్‌) 15 వేల ఆధిక్యం

పెద్దపల్లిలో 17వేల లీడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు

(The above story first appeared on LatestLY on Dec 03, 2023 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).