MLA Raja Singh on Party Change: ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్య

గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.

MLA Raja Singh on Party Change: ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్య
BJP MLA Raja singh

Hyd, August 29: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను.

తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ గనుక నాకు టికెట్‌ ఇవ్వకుంటే.. రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేస్తా. కానీ, హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటా. అయినా బీజేపీ అధిష్టానం నా విషయంలో సానుకూలంగా ఉంది. సరైన టైంలో నాపై వేటు ఎత్తేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారాయన.

తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..

అలాగే.. బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ ఇండిపెండెంట్‌గా కాని.. వేరే పార్టీల నుంచి కాని పోటీ చేయను అని స్పష్టం చేశారు.

మళ్లీ గోషా మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ చేతిలో లేదని రాజా సింగ్ చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టాలనేది నిర్ణయించేది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు. ఓవైసీ సోదరులు ఎవరి పేరు చెబితే వారికే కేసీఆర్ టికెట్ ఇస్తారని విమర్శించారు.

(The above story first appeared on LatestLY on Aug 29, 2023 02:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).