Hyderabad, Aug 28: తెలంగాణలో (Telangana) భారీఎత్తున బోగస్ ఓట్లు (Bogus Votes) బయటపడ్డాయి. వీటిని ఈసీఐ (ECI) తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో వెల్లడించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లను తొలగించారు. వారిలో 50 వేల మంది కుత్బుల్లాపూర్‌కు చెందిన వారని సమాచారం. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్‌లలో అత్యధికంగా నకిలీ ఓటర్లు ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది.
10L bogus votes deleted in Telangana, 50% of them in Hyderabad
— Satyajith (@satyajithpinku) August 28, 2023
విధివిధానాల అమలు
డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలను పాటించామని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. మారిన ఓటర్ల తొలగింపుకు సంబంధించి ECI సర్క్యులర్‌ను వికాస్ రాజ్ పరిశీలించారు. కచ్చితత్వం, యాక్సెసిబిలిటీని నిర్ధారించే లక్ష్యంతో పేర్లు మరియు చిరునామాలలోని దిద్దుబాట్లకు సంబంధించిన సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.