Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి.

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు
Exit polls

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలుచుకోనుందని అంచనా వేస్తున్నాయి.  అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

తెలంగాణలో బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రస్తుతం ఉన్న తన నాలుగు సీట్లను డబుల్ లేదా అంతకంటే ఎక్కువకు పెంచుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ 8 నుంచి 10 సీట్లు గెలుచుకోనుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1 స్థానం, మజ్లిస్ పార్టీ ఒక స్థానం గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 16 నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీపడ్డాయి.

వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు...

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే - కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-10, మజ్లిస్ 01

జన్ కీ బాత్ సర్వే - కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-11, మజ్లిస్ 01

న్యూస్ మినట్ సర్వే - కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-12, మజ్లిస్ 01

ఏబీపీ సర్వే - కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఇతరులు - 01

ఆరా మస్తాన్ సర్వే - కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8-9, మజ్లిస్ 01

న్యూస్18 సర్వే - కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, ఇతరులు 3-5

టీవీ9 ఎగ్జిట్ పోల్ సర్వే - కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, ఇతరులు 1

సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే - కాంగ్రెస్ 8-9, బీజేపీ 7-8, మజ్లిస్-1, బీఆర్ఎస్-0

(The above story first appeared on LatestLY on Jun 01, 2024 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).