Exit polls

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.  ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయి... ఒక్కోసారి గురి తప్పుతుంటాయి. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఉత్సాహం, ఊరట కలిగిస్తుంటాయి. మొత్తం లోక్ సభ స్థానాలు 543 కాగా... ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. ఆ వివరాలను పరిశీలిస్తే...

జన్ కీ బాత్...

బీజేపీ కూటమి 362-392

కాంగ్రెస్ కూటమి 141-161

ఇతరులు 10-20

న్యూస్ నేషన్...

బీజేపీ కూటమి 340-378

కాంగ్రెస్ కూటమి 153-169

ఇతరులు 21-23

టైమ్స్ నౌ...

బీజేపీ కూటమి 353-368

కాంగ్రెస్ కూటమి 118-133

ఇతరులు 43-48

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్...

బీజేపీ కూటమి- 371

కాంగ్రెస్ కూటమి- 125

ఇతరులు- 47

రిపబ్లిక్-పీ మార్క్...

బీజేపీ కూటమి- 359

కాంగ్రెస్ కూటమి- 154

ఇతరులు- 30

రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్...

బీజేపీ కూటమి 353-368

కాంగ్రెస్ కూటమి 118-133

ఇతరులు 43-48

దైనిక్ భాస్కర్...

బీజేపీ కూటమి 281-350

కాంగ్రెస్ కూటమి 145-201

ఇతరులు 33-49