TS Government New Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం అర్హతా నిబంధనలు ఇవే, https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోండి

తెలంగాణలో వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది

TS Government New Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం అర్హతా నిబంధనలు ఇవే, https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోండి
TSPSC

Hyd, June 7: తెలంగాణలో వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత కేబినేట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు.

కాంగ్రెస్‌ రాజ్యం అంటే దళారీ భోజ్యం, తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, నాగర్ కర్నూల్ స్పీచ్ హైలెట్ ఇవిగో..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈనెల 9న ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని, అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు.

అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు.

బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక

ఇవీ అర్హతా నిబంధనలు

1. ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి వీలుగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

2.ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

3 2023 జూన్‌ 2 నాటికి 18-55 ఏళ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు.

4. లబ్ధిదారుడి వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు.

5, గత అయిదేళ్లలో ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

6. ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

7. మండల స్థాయిల్లో ఎంపీడీఓలు, పురపాలికల్లో మున్సిపల్‌ కమిషనర్లు ఈనెల 20 నుంచి 26 వరకు దరఖాస్తులను పరిశీలించాలి.

8. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ జిల్లాస్థాయిలో ఎంపిక పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన అనుమతులను ఈనెల 27 నుంచి జులై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ద్వారా పొందాలి.

9. లబ్ధిదారులను దశల వారీగా ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని గ్రామాలు, మండలాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

10. ఎంపికైన లబ్ధిదారులకు ప్రతినెలా 15న ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.

11. ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారుల ఇష్టమే.

12. ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

(The above story first appeared on LatestLY on Jun 07, 2023 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).