Free EAMCET Coaching: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష
తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Hyderabad, Dec 6: తెలంగాణలో (Telangana) ప్రభుత్వ కాలేజీల్లో (Govt. Colleges) ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు (Inter Students) శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు (Private Coaching Centres) దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ (EAMCET Coaching) ఇవ్వాలని నిర్ణయించింది.
డిసెంబరులోనే సిలబస్ పూర్తి చేసి ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.శిక్షణ కోసం మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్ వారీగా ప్రతి జిల్లాలో 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తారు.
మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో వీరికి ఉచిత శిక్షణ ఇస్తారు.
(The above story first appeared on LatestLY on Dec 06, 2022 08:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

