Exit Polls 2022

దేశ సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న  హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ నేడు ముగిసింది. దీంతో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా 68 శాసనసభ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ తిరిగి పవర్‌ లోకి రావడం సవాలుగా మారనుందనే  సర్వేలు చెబుతున్నాయి.

గుజరాత్ మళ్లీ బీజేపీ ఖాతాలోకే అంటున్న Republic-PMARQ Exit Polls, రెండవ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ, మూడవ స్థానంలో ఆమ్ ఆద్మీ

1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ అధికార పార్టీ వెంటనే తిరిగి అధికారంలోకి రాలేదని చరిత్ర చెబుతోంది.  గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌కు హిమాచల్‌లో భారీ ఊరట లభించనున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్‌ పల్స్‌ చేసిన సర్వే ప్రకారం బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 29-39 సీట్లు వచ్చే అవకాశం ఉండగా,  బీజేపీ 27 నుంచి 37 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు పేర్కొంది.

Here's Aaj Tak Survey

కాంగ్రెస్, బీజేపీ మధ్య 0.4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని సర్వేలు చెబుతున్నాయి. కేవలం 2.1 ఓటింగ్‌ షేర్‌ను మాత్రమే పొందింది.

మళ్లీ ఊడ్చేసిన చీపురు, ఎంసీడీ అరవింద్ కేజ్రీవాల్‌దే, బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న పలు ఎగ్జిట్ పోల్స్

అయితే  68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 35 సీట్లు మాత్రమే. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.