Telangana: వేరే వ్యక్తితో ప్రియురాలి పెళ్లి, లవర్ ముందే పెట్రోల్ పోసుకుని కాల్చుకున్న ప్రియుడు, అనంతరం ఆమెను హత్తుకునే ప్రయత్నం, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు వేరే పెళ్లికి సిద్దపడటటంతో ఆమె ప్రియుడు ఆత్మహత్యకు (Man commits Suicide) పాల్పడ్డారు. ఏకంగా ప్రియురాలి పెళ్లిలోనే ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్‌లో (Lover marriage Venue In Hyderabad) చోటుచేసుకుంది.

Telangana: వేరే వ్యక్తితో ప్రియురాలి పెళ్లి, లవర్ ముందే పెట్రోల్ పోసుకుని కాల్చుకున్న ప్రియుడు, అనంతరం ఆమెను హత్తుకునే ప్రయత్నం, చికిత్స పొందుతూ బాధితుడు మృతి
Representational Picture. Credits: PTI

Hyd, July 4: భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు వేరే పెళ్లికి సిద్దపడటటంతో ఆమె ప్రియుడు ఆత్మహత్యకు (Man commits Suicide) పాల్పడ్డారు. ఏకంగా ప్రియురాలి పెళ్లిలోనే ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్‌లో (Lover marriage Venue In Hyderabad) చోటుచేసుకుంది. లంగర్ హౌస్ లో తన ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో యువతి పెళ్లి జరుగుతున్న చోటుకు చేరుకున్న ప్రియుడు మనస్తాపం చెంది పెళ్లి మండపంలోనే పెట్రోల్‌ పోసుకొని కాల్చుకున్నాడు. కామాంధుడైన అయ్యవారు, విద్యార్థిని తల్లిపై అత్యాచారం, వీడియో తీసి అడిగినప్పుడు రావాలని బెదిరింపులు, పోలీసులుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అంతటితో ఆగకుండా యువకుడి శరీరానికి మంటలంటుకోవడంతో అలాగే వెళ్లి వధువును హత్తుకున్నాడు. అలెర్ట్‌ అయిన బంధువులు వధువును వెంటనే పక్కకు జరిపారు. వధువుకు స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(The above story first appeared on LatestLY on Jul 04, 2022 06:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).