Karnataka Shocker: కామాంధుడైన అయ్యవారు, విద్యార్థిని తల్లిపై అత్యాచారం, వీడియో తీసి అడిగినప్పుడు రావాలని బెదిరింపులు, పోలీసులుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడైన టీచర్ విద్యార్థిని తల్లిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో తీశాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలని లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

Karnataka Shocker: కామాంధుడైన అయ్యవారు, విద్యార్థిని తల్లిపై అత్యాచారం, వీడియో తీసి అడిగినప్పుడు రావాలని బెదిరింపులు, పోలీసులుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Rape Representative image.

Raichur, July 3: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడైన టీచర్ విద్యార్థిని తల్లిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో తీశాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలని లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. సదరు ఉపాధ్యాయుడిని స్కూలు నుండి సస్పెండ్ (Teacher Suspended ) చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని రాయచూర్‌లోని సింఘాపుర ప్రభుత్వ పాఠశాలలో మహ్మద్ అజారుద్దీన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇతను గతంలో పాఠశాల విద్యార్థులను దుర్భాషలాడాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని తల్లికి ఆశచూపి లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. మీ కూతురుకు ట్యూషన్, ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని టీచర్ దాదాపుగా బలవంతం చేశాడని ( Forcing Student’s Mother for Sex) విద్యార్థిని తల్లి ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనను నిందితుడు టీచర్ వీడియో తీశాడు.

అయోధ్య ఆలయంలో వ్యక్తి గొంతు కోసి దారుణ హత్య, అరుగుపై పడుకుని నిద్ర పోతుండగా ఘాతుకానికి పాల్పడి బంధువు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతరం బ్లాక్ మెయిల్ కి దిగాడు. తను అడిగినప్పుడల్లా రావాలని లేదంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో (Circulating Video in Raichur) పెట్టాడు. దీంతో బాధితురాలు కరటగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు నిందితుడు టీచర్ స్కూల్ పిల్లలపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. వారి వ్యక్తిగత భాగాలను తాకడం అతని ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ఉపాధ్యాయుడిని రాయచూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

(The above story first appeared on LatestLY on Jul 04, 2022 02:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).