Jagtial Shocker: అనుమానం..కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు, మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణం, తల్లి హత్య..తండ్రి జైలుకు వెళ్లడంతో బిక్కుబిక్కుమంటున్న రోదిస్తున్న పిల్లలు, జగిత్యాలలో విషాద ఘటన
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా చెర్లపల్లిలో అనుమానంతో భార్యను గొడ్డలితో ఓ భర్త నరికి చంపేశాడు. మద్యంమత్తు, కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యను (Man kills wife suspecting infidelity in Jagtial) కడతేర్చాడు.
Jagtial, Feb 22: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా చెర్లపల్లిలో అనుమానంతో భార్యను గొడ్డలితో ఓ భర్త నరికి చంపేశాడు. మద్యంమత్తు, కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యను (Man kills wife suspecting infidelity in Jagtial) కడతేర్చాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. ఇక తల్లి హత్య..తండ్రి కటకటాల పాలు కావడంతో ఇద్దరు పిల్లలు దిక్కులేని అనాథలై బిక్కు బిక్కుమంటూ రోదిస్తున్నారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అంబారిపేటకు చెందిన సుజాతకు వెలగటూర్ మండలం చెర్లపల్లి కి చెందిన శంకరయ్యతో 16ఏళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు జన్మించారు.
ఉపాధి నిమిత్తం ముంబైకి వెళ్లిన భర్త తాను సంపాదించిన సొమ్ము తాగుడికే ఖర్చు చేసేవాడు. కూలీ పనితో సుజాత ఇద్దరు కొడుకులను పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ముంబై నుంచి ఇంటికి చేరిన శంకరయ్య భార్యపై అనుమానం పెంచుకుని గొడవపడ్డాడు. తాగొచ్చి భర్త గొడవ పడటంతో భయంతో సుజాత రాత్రంతా వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. తెల్లవారుజామున ఇంటికి రాగా మద్యం మత్తులో ఆగ్రహంతో ఉన్న భర్త శంకరయ్య భార్యను నరికి చంపాడు.
భార్య ప్రాణాలు పోయాక అక్కడే కొద్దిసేపు గొడ్డలి పట్టుకొని కూర్చుండిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే శంకరయ్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు తెలిపారు. స్థానికంగా ఉండని భర్త, భార్యపై అనుమానం తెంచుకొని నిత్యం గొడవ పడేవాడిని స్థానికులు తెలిపారు. శంకరయ్యకు ఇదివరకు ఓ పెళ్లి కాగ విడాకులు తీసుకొని సుజాతను రెండో వివాహం చేసుకున్నాడని చెప్పారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు, ఆర్థిక ఇబ్బందులు భార్య ప్రాణాలు తీయడంతో వారి ఇద్దరు కొడుకులు అనాధలుగా మారారు.
(The above story first appeared on LatestLY on Feb 22, 2021 09:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

