Warangal Shocker: వరంగల్ జిల్లాలో వరుసగా మూడో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమికుడు పెళ్లికి ఒప్పుకోలేదని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న డిగ్రీ విద్యార్థిని
ఉమ్మడి వరంగల్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికల్ విద్యార్థి ప్రీతి, బీటెక్ స్టూడెంట్ రక్షిత ఆత్మహత్య ఘటనలు మరవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు (student Committed Suicide in warangal) పాల్పడింది
Hyd, Feb 27: ఉమ్మడి వరంగల్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికల్ విద్యార్థి ప్రీతి, బీటెక్ స్టూడెంట్ రక్షిత ఆత్మహత్య ఘటనలు మరవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు (student Committed Suicide in warangal) పాల్పడింది. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన పోగుల ఉషారాణి డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సు చేస్తోంది.
ఆమెకు భూపాలపల్లికి చెందిన ప్రశాంత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ప్రియుడు ప్రేమించిన కొద్ది రోజులకు పెళ్లికి నిరాకరించడంతో (lover cheating ) మనస్తాపం చెందిన విద్యార్థిని సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఉషారాణి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఉషారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 27, 2023 10:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

