Rape image (Pic Credit- PTI)

Hyd, Oct 3: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జనగాం జిల్లాలో గత కొంతకాలంగా మైనర్ బాలికను లోబర్చుకున్న వ్యక్తి.. ఆ తర్వాత బాలిక అందుకు అంగీకరించలేదనే కోపంతో తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశాడు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఏసీపీ డి.రఘుచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలని ఓ గ్రామానికి చెందిన గుర్రం శ్యామ్‌(21) అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను పరిచయం చేసుకొని శారీరకంగా (Minor Girl Rape Case) లోబర్చుకున్నాడు. తరువాత ఆమె నిరాకరించడంతో తనతో బాలిక సన్నిహితంగా మెలిగిన వీడియోలను (Minor Girl Videos) బహిర్గతం చేస్తానని బెదిరించాడు.

రెండవ భార్య తమ్ముడితో సంబంధం పెట్టుకుందని అనుమానం, లాడ్జికి తీసుకువెళ్లి చంపేసిన భర్త, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

బాలిక వినకపోవడంతో స్నేహితుల సాయంతో వాట్సాప్‌ గ్రూపుల్లో పలువురికి పంపి వైరల్‌ చేశాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్యామ్‌తో పాటు అతడి స్నేహితుడు సాంబరాజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి మరో నలుగురు స్నేహితులు (మైనర్లు) సైతం వాట్సాప్‌లో వీటిని వైరల్‌ చేశారు. వీరిపై కూడా పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఏసీపీ డి.రఘుచందర్‌ తెలిపారు.