Representational Image | (Photo Credits: IANS)

Hyd, Oct 3: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతో తన రెండవ భార్యను ఓ భర్త హత్య చేసిన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అఫ్జల్‌గంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన పత్లావత్‌ రామకృష్ణ (31) నగరంలోని గచ్చిబౌలిలో పుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మైనర్ బాలికను పొదల్లోకి లాక్కెళ్లి 8 మంది దారుణంగా అత్యాచారం, వీడియో తీసి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

అతనికి ఇద్దరు భార్యలు. అయితే రెండవ భార్య పత్లావత్‌ అరుణ అతని తమ్ముడితో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం రావడంతో శనివారం గౌలిగూడలోని మణికంఠ లాడ్జికి తీసుకువచ్చి ఆదివారం ఆమెను హత్య చేసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.