COVID in TS: తెలంగాణలో 5 వేలకు చేరువైన మొత్తం కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 237 పాజిటివ్ కేసులు నమోదు, 185కు పెరిగిన కరోనా మరణాలు
హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 195 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత మేడ్చల్ నుంచి 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల నుంచి 3 కేసులు రాగా, నిజామాబాద్, కామారెడ్డి....
Hyderabad, June 14: తెలంగాణలో ఆదివారం మరో 237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,974 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,525 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఎప్పట్లాగే హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 195 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత మేడ్చల్ నుంచి 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల నుంచి 3 కేసులు రాగా, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్ , మహబూబ్ నగర్ , కరీంనగర్ జిల్లాల నుంచి 2 చొప్పున, అలాగే సిద్దిపేట, యాదాద్రి, వరంగల్ రూరల్, సిరిసిల్ల, ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.
ఆదివారం ముగ్గురు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 185 కు పెరిగింది. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
Telangana's #COVID19 Report:

ఇదిలా ఉంటే ఈరోజు మరో 25 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,377 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,412ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jun 14, 2020 10:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

