Telangana: తెలంగాణలో కొత్తగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1900 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 56కు పెరిగిన కరోనా మరణాలు

మరికొన్ని రోజుల్లో వానాకాలం రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కరోనాకు తోడుగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈనెల...

Telangana: తెలంగాణలో కొత్తగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1900 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 56కు పెరిగిన కరోనా మరణాలు
COVID19 Lockdown in Telangana. | Photo: Twitter

Hyderabad, May 25: తెలంగాణలో కోవిడ్-19 విజృంభిస్తుంది, రోజురోజుకు వచ్చే పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. సోమవారం కొత్తగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1920 కు చేరింది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 31 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి మరొక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 164 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

మరోవైపు, రాష్ట్రంలో గత వారం రోజులుగా వరుసగా కోవిడ్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం కూడా మరో 3 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 56కి పెరిగింది. వరంగల్ 9 మర్డర్ల మిస్టరీని ఛేదించిన పోలీసులు, నిద్ర మాత్రల ఇచ్చి బావిలో పడేసిన నిందితుడు

అయితే సోమవారం ఒక్కరోజే 72 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదొక్కటి కొంత ఊరట కలిగించే విషయం. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1164 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 700 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

సీఎం కేసీఆర్ సమీక్ష

ఇక మరికొన్ని రోజుల్లో వానాకాలం రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కరోనాకు తోడుగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు  ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్లు సమాచారం.

 

(The above story first appeared on LatestLY on May 25, 2020 09:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).