Telangana Shocker: ప్రేమించకపోతే ఇలా కక్ష తీర్చుకుంటారా.. యువతి లవ్ చేయడం లేదనే కోపంతో ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, నల్గొండ జిల్లాలో దారుణం

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు ఉన్మాదిలా (Telangana Shocker) మారాడు. యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.మాట్లాడుకుందామంటూ పిలిచి ఈ ప్రేమోన్మాది కత్తితో (20 year old man stabs girl) ఇష్టం వచ్చినట్లుగా తన పొడిచి కక్ష తీర్చుకున్నాడు.

Telangana Shocker: ప్రేమించకపోతే ఇలా కక్ష తీర్చుకుంటారా.. యువతి లవ్ చేయడం లేదనే కోపంతో ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, నల్గొండ జిల్లాలో దారుణం
Stabbed (file image)

Hyd, August 10: తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు ఉన్మాదిలా (Telangana Shocker) మారాడు. యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.మాట్లాడుకుందామంటూ పిలిచి ఈ ప్రేమోన్మాది కత్తితో (20 year old man stabs girl) ఇష్టం వచ్చినట్లుగా తన పొడిచి కక్ష తీర్చుకున్నాడు. దగ్గరలోనే ఉన్న యువతి స్నేహితులు అది చూసి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణ శివార్లలోని పానగల్‌కు చెందిన గుండెబోయిన నవ్య నల్గొండలోని ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. అదే పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన మీసాల రోహిత్‌ కూడా ఇదే కాలేజీలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలంటూ అతను నవ్య వెంట పడుతున్నాడు. అయితే ఆమె అతన్ని ప్రేమించనని తెగేసి చెప్పింది.

మంగళవారం కాలేజీకి సెలవు ఉండటంతో నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠతో కలిసి మరో స్నేహితుడు తాయిని కలిసేందుకు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం వద్దకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్‌ బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి మాట్లాడాలని నవ్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో (man stabs girl with knife) దాడి చేశాడు. దీంతో నవ్య గొంతు, పొట్ట, పెదవులు, చెయ్యి మణికట్టు, కాలుపై తీవ్ర గాయాలయ్యా యి. నవ్య స్పృహ తప్పింది. అప్పటికే స్నేహితులు తాయి, శ్రేష్ఠ గట్టిగా అరవడంతో.. రోహిత్‌ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందిన వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నవ్యను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

తాంత్రికుడి మాటలు నమ్మి.. తల్లిదండ్రులను దారుణంగా చంపేసిన యువకుడు, ఈ కిరాతకానికి సహకరించిన బాలుడి బంధువులు

ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. తనను ప్రేమించకుంటే చంపేస్తానంటూ రోహిత్‌ గత నెల 27న నవ్య గొంతుపై పగిలిన బీరు సీసా పెట్టి బెదిరించినట్టు చెప్తున్నారు. బాధితురాలి తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌ టౌన్‌ సీఐ రౌతు గోపి తెలిపారు. దాడి ఘటనపై ఎస్పీ రెమా రాజేశ్వరి ఆరా తీశారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసులు ముమ్మరంగా గాలించి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 10, 2022 11:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).