Stabbed (file image)

Raipur, August 9: ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పుర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17 ఏళ్ళ బాలుడు తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే (Minor kills parents) అతి కిరాతకంగా చంపేశాడు. అందుకు వారి బంధువులు కొందరు బాలుడికి సహకరించటం ఇంకా విషాదంగా చెప్పుకోవాలి. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అయితే మానసికంగా బాధపడుతున్న సోదరుడికి నయమవుతుందని (sacrifice to cure his mentally-ill brother), దీనికి మీ తల్లిదండ్రులను చంపేయాలని ఆ తాంత్రికుడు చెప్పడంతో బాలుడు ఈ దారుణానికి పూనుకొన్నాడు.

ఈ ఘటనలో నందిగావూన్‌ గ్రామంలో బాలుడి తల్లిదండ్రులు మృతదేహాలను ఆగస్టు 1న స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌గఢ్‌ ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మృతులు మహేశ్‌పుర్‌కు చెందిన సుక్రు యాదవ్‌(40), మన్మతి యాదవ్‌(45)లుగా గుర్తించామని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఈ హత్యల్లో కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో తన తల్లిదండ్రులను మరో ఏడుగురితో కలిసి తానే హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు.

ప్రసాదం ఇచ్చి భక్తురాలిపై దొంగ స్వామీజి అత్యాచారం, తరువాత ఆ దేవతే నీపై అత్యాచారం చేసిందని వెల్లడి, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..నెల రోజుల క్రితం బాలుడి సోదరుడు మానసిక రోగిగా మారాడు. ఆ తర్వాత సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడు మోహన్‌ యాదవ్‌ దగ్గరకు ఆ బాలుడిని తీసుకెళ్లారు. మీ తల్లిదండ్రులు మంత్రాలు చేయటం ద్వారానే అతడు మానసిక రోగిగా మారినట్లు తాంత్రికుడు తెలిపాడు. వారిని హత్య చేస్తే మామూలు మనిషిలా మారతాడని సెలవిచ్చాడు. అలాగే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుందని నమ్మించాడు.

దీంతో బావ నర్సింగ్‌ యాదవ్‌, సోదరుడు రాజు రామ్‌ యాదవ్‌, భోలే శంకర్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌, ఖగేశ్వర్‌ యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, దశరథ్‌ యాదవ్‌లతో కలిసి బాలుడు పథకం రచించాడు. హత్య చేశాక మృతదేహాలను మహానది నదిలో పడేయాలని ప్రణాళిక వేశారు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం తీసుకుని భగ్వాన్‌పుర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ తాడు, టవల్‌, ప్లాస్టిక్‌ సింక్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి బాధితులను వాహనంలో ఎక్కించుకున్నారు. సురాజ్‌గఢ్‌లోని మహానది వంతన వద్దకు తీసుకెళ్లి వారిని గొంతు కోసం హత్య చేశారు. అనంతరం మృతదేహాలను మహానది నదిలో పడేశారు.