Representational Image | (Photo Credits: PTI)

Hyd, Dec 3: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై మేనత్త లైంగిక దాడి (Aunty molestation minor boy) చేయడమే కాకుండా డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడింది. పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని స్కూలు నుంచి లాడ్జికి తీసుకువెళ్లి తన కామవాంఛలను తీర్చుకుంది. అనంతరం ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు (blackmail with Video in banjara hills) పాల్పడింది.

జూబ్లీహిల్స్ పోలీసుల సమాచారం మేరకు... టోలీచౌకిలోని సాలార్‌జంగ్‌ కాలనీలో నివాసముండే మహిళ తన కుటుంబంతో సహా రెండు నెలల కిందట గాయత్రీహిల్స్‌కి మకాం మారింది. కొద్ది రోజుల కిందట ఈ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు(14) తాను మేనత్తకు ఒక నెక్లెస్‌ ఇచ్చానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేదని చెప్పాడు.

ఫోన్ చేస్తే మాట్లాడని ప్రియురాలు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, మరో చోట అదనపు కట్నం వేధింపులకు పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న నవవధువు

తాను చదువుతున్న స్కూల్‌కు వచ్చి కారులో ఎక్కించుకొని తనతో పాటు తీసుకెళ్లి లాడ్జిలో తన వాంఛలు తీర్చుకునేదని ఈ క్రమంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్‌ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని ఎవరికైనా ఈ విషయం తెలియజేస్తే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని... ఇలా మూడుసార్లు తనను లాడ్జికి తీసుకెళ్లిందన్నారు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో దొంగిలించినట్లు బాలుడు తల్లికి చెప్పాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్‌ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.