
Kamareddy, Dec 3: కామారెడ్డి జిల్లాలోని దళితవాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి (young man attempted suicide) పాల్పడ్డాడు. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొద్దిరోజులుగా హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి మాట్లాడటం లేదని ఇంటి వద్ద నరేష్ బ్లేడ్‌తో గొంతు (Attempted suicide) కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్‌ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నరేష్ పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం వేధింపులకు నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్‌లో విషాదం నింపింది. కట్నం కింద రూ. 17లక్షలు ఇచ్చి.. ఇతర కానుకలు ముట్టజెప్పినా.. భర్త, అత్తామామల వేధింపులు ఆగలేదు. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని పుట్టింట్లో వదిలేయడం.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వారిపై భారం వేయొద్దని కానరాని లోకాలకు వెళ్లింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అడవిశ్రీరాంపూర్‌కు మారం వెంకన్న, సరోజనకు కూతురు పవిత్ర, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పవితక్రు ఈ ఏడాది ఆగస్టు 21న మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం లక్ష్మి, ఓదెలు కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.17లక్షలు, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనం ఇచ్చారు. కాపురంలో పట్టుమని పది రోజులు కాకుండానే నరేశ్‌లో అదనపు కట్నమనే పిశాచి ఆవహించింది.