Telangana Shocker: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య, కరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన

కరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వేములవాడ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గొర్రె వెంకటేష్(35) అనే యువకుడు భార్య కాపురానికి రావడం లేదని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana Shocker: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య, కరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన
Suicide (Photo Credits: Twitter)

Hyd, Nov 9: కరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వేములవాడ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గొర్రె వెంకటేష్(35) అనే యువకుడు  భార్య కాపురానికి రావడం లేదని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎస్సె మారుతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేష్ పదేళ్ల క్రితమే జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య విబేదాలు రావడంతో ఆమె జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య కాపురానికి రావడం లేదని.. భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

చైన్నైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, భార్యలను రాత్రంతా ఇచ్చి పుచ్చుకుంటూ భర్తలు ఎంజాయ్, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు

ఈ నేపథ్యంలో వెంకటేష్ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 09, 2023 04:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).