Telangana Shocker: తెల్లారితే పెళ్లి.. వేకువజామున అక్క భర్తతో జంప్ అయిన వధువు, దిమ్మతిరిగే ట్విస్టుతో షాక్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు, జగిత్యాలలో ఘటన

తెలంగాణలోని జగిత్యాలలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ వధువు పెళ్లి ముందు రోజు అక్క భర్తతో పరార్ అయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Telangana Shocker: తెల్లారితే పెళ్లి.. వేకువజామున అక్క భర్తతో జంప్ అయిన వధువు, దిమ్మతిరిగే ట్విస్టుతో షాక్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు, జగిత్యాలలో ఘటన
Wedding Representational Image

Jagtial, May 8: తెలంగాణలోని జగిత్యాలలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ వధువు పెళ్లి ముందు రోజు అక్క భర్తతో పరార్ అయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఉదయం వధువు ఇంటివద్ద వివాహం జరగాల్సి ఉండగా అంతా సిద్ధంచేశారు.అంతలోనే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వేకువజామున వెళ్లి చూసేసరికి వధువు కనిపించలేదు. చివరికి పొరుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అక్క భర్తనే వివాహానికి వచ్చి, వధువును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు.

ఇంట్లో కూర్చుని రూ. లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్, ఆశపడి కోటి రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధితుడు, పుణేలో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి

దీంతో వివాహం నిలిచిపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. చెల్లె వివాహానికి వస్తే తన భర్తే ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే పనిలో ఉన్నారు.

(The above story first appeared on LatestLY on May 08, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).