Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

Pune, May 8: ఆన్‌లైన్ టాస్క్ స్కామ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ స్కామ్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో విస్తరిస్తోంది. నగరం, సమీప ప్రాంతాలలో చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో పొందిన పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌లో పడి డబ్బును కోల్పోయినట్లు నివేదించారు. స్కామర్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలను సంప్రదించి, అదనపు ఆదాయ వనరును అందిస్తామనే సాకుతో లక్షల్లో మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఈ సైబర్ స్కామర్ల చేతిలో దాదాపు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.

పూణే టైమ్స్ మిర్రర్ కథనం ప్రకారం, స్కామర్లు సెప్టెంబర్ 25, నవంబర్ 5 మధ్య 56 ఏళ్ల అడ్వర్టైజ్‌మెంట్ ఫిల్మ్ మేకర్‌ని రూ. 96.57 లక్షలు మోసం చేశారు. బవ్‌ధాన్-ఎన్‌డిఎ రోడ్‌లోని రాంబాగ్ కాలనీలో నివసిస్తున్న బాధితుడి మొబైల్ కి టెక్స్ట్ సందేశం వచ్చింది. ట్రావెల్ ఏజెన్సీలకు రేటింగ్ ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని చెప్పారు. తొలుత నమ్మకం కలిగేందుకు బాధితుడి ఖాతాలో వెల్కం బోనస్ కింద రూ.10 వేలు జమచేశారు. ఆపై కొన్నిరోజులు కమీషన్ కూడా ఇచ్చారు. ఆపై పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ చేయించుకుని స్పందించడం మానేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

స్మార్ట్ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో ఉండాల్సిందే.. సమాచార వ్యాప్తిలో డిజిటల్ అంతరం తగ్గించేందుకు ఎఫ్‌ఎం అవసరమన్న కేంద్రం.. మొబైల్ ఫోన్ల తయారీదారులకు ఆదేశాలు

అసలు కథ ఏంటంటే.. పూణెకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఫోన్ కు గతేడాది సెప్టెంబర్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఆన్ లైన్ లో పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ ఉందని, గ్రూప్ చాట్ లో చేరాలని అందులో సూచించారు. ఆ గ్రూప్ లో చేరిన తర్వాత వెల్కం బోనస్ కింద బాధితుడి ఖాతాలో రూ.10 వేలు జమ చేశారు. కార్పొరేట్ ట్రావెల్ మేనేజ్ మెంట్ (సీటీఎం) పేరుతో ట్రావెల్ ఏజెన్సీలకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తామని చెప్పారు. తొలుత టాస్క్స్ ఇవ్వడానికి రెండు వాయిదాలలో రూ.21,990 లు కట్టించుకున్నారు. టాస్క్ పూర్తిచేసిన తర్వాత కమిషన్ తో కలిపి రూ.24,809 లు బాధితుడి ఖాతాలో జమ చేశారు.

రెండో దఫాలో రూ.80 వేలు కట్టించుకుని, రూ.94,840 తిరిగిచ్చారు. ఆ తర్వాత రూ.1 లక్ష కడితే మంచి లాభాలు వస్తాయని చెప్పడంతో బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా పంపించాడు. అయితే, ఈ సారి మాత్రం మోసగాళ్లు నగదును తిరిగి జమ చేయలేదు. వారు చెప్పిన టాస్క్ పూర్తిచేసినా డబ్బులు రాకపోవడంతో ఫోన్ లో సంప్రదించగా.. ఈసారి రూ.35.25 లక్షలు కడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పారు. దీంతో బాధితుడు ఆ మొత్తాన్ని మోసగాళ్ల ఖాతాలో జమ చేశాడు.

రోజులు గడిచినా ఆ మొత్తం కూడా తిరిగివ్వక పోగా మరోమారు రూ.61.32 లక్షలు కడితే బాకీ మొత్తాన్ని భారీ లాభాలతో చెల్లిస్తామని చెప్పారు. అప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టిన బాధితుడు మరోమారు మోసగాళ్ల మాటలకు తలూపాడు. వారు అడిగిన మొత్తాన్ని పంపించాడు. వారు ఇచ్చిన టాస్క్ లు కూడా పూర్తి చేశాడు. అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో మరోమారు ఫోన్ చేయగా.. ఇంకొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని అడిగారు.

తన వద్ద డబ్బులేదని, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి తిరిగివ్వాలని బాధితుడు కోరడంతో ఫోన్ పెట్టేశారు. తిరిగి ఎన్నిమార్లు ప్రయత్నించినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దశలవారీగా మొత్తం రూ.96 లక్షలు కాజేశారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు ప్రారంభించారు. నెట్ బ్యాంకింగ్, జీ-పే, పేటీఎం సేవల ద్వారా బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలకు 58 లావాదేవీలు జరిపినట్లు నివేదిక వెల్లడించింది. సైబర్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.