Newdelhi, May 7: స్మార్ట్ ఫోన్లలో (Smart Phone) ఎఫ్ఎం రేడియో (FM Radio) సదుపాయం తప్పనిసరిగా ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు (Phone Manufacturers) కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమైన సమాచారం (Important Information), వినోదం (Entertainment) ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది అవసరమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మొబైల్ తయారీదారుల సంఘాలైన ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఐటీ మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వక సూచనలు జారీ చేసింది. మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం లేకపోవడాన్ని ఇటీవల కాలంలో తాము గుర్తించినట్టు ఈ సందర్భంగా పేర్కొంది. స్మార్ట్ ఫోన్లతో పాటూ స్టాండ్ ఎలోన్ రేడియోలు, కార్లలో రేడియో రిసీవర్లూ అవసరమని కూడా స్పష్టం చేసింది.
FM Radio must be present and enabled on all mobile phones, government advisory warns
— IndiaTodayTech (@IndiaTodayTech) May 6, 2023
ఎఫ్ఎం తప్పనిసరి అని చెప్పడానికి కేంద్రం చెప్పిన కారణాలు
అత్యవసర పరిస్థితులు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఎఫ్‌ఎం రేడియో సేవలు ఎంతో కీలకంగా మారతాయని కేంద్రం పేర్కొంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఎఫ్ఎమ్ రేడియోలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా తెలిపింది.