Newyork, May 7: అమెరికాలో (America) తుపాకీ సంస్కృతి వెర్రితలలకు పోతున్నది. కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ (Texas) రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ (Shopping Mall) సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. దీంతో ఆగంతకుడు మరింతగా రెచ్చిపోతుండగా అప్పటికే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే హతమయ్యాడు. నిందితుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. గాయపడ్డవారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం.
At least nine people are hospitalized after a mass shooting at a mall in Allen, Texas. The suspect - who was wearing tactical gear - was killed by police who were in the area on an unrelated call. Police are holding on sharing the number of fatalities. https://t.co/JIQ27xe9Ow
— Shannon Watts (@shannonrwatts) May 7, 2023
ఐదు నెలల్లో 198 కాల్పుల ఘటనలు
అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తరువాత ఇదే అత్యధికమని పరిశీలకులు చెబుతున్నారు. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా 2020లో 45 వేల మంది మరణించారు.