Vijayawada, May 7: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) నిన్న పదో తరగతి పరీక్ష ఫలితాలు (SSC Results) విడుదల కావడం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో మార్కులు తక్కువ (Less Marks) వచ్చాయని కొందరు, పాస్ (Pass) కాలేదన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
సూసైడ్ చేసుకున్నది వీళ్లే..
శ్రీసత్యసాయి జిల్లా నవాబుకోటకు చెందిన సుహాసిని పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మరణించింది. నంద్యాల జిల్లా పోతులదొడ్డి గ్రామానికి చెందిన కామాక్షి మ్యాథ్స్ లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యయత్నానికి పాల్పడినవాళ్ళు..
ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన దినేశ్ కుమార్ పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కి పరీక్షా ఫలితాల్లో 434 మార్కులు వచ్చాయి. అయితే, మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో తోటకు వెళ్లి విషం తాగాడు. గమనించిన తండ్రి ఆసుపత్రిలో చేర్చారు.