Telangana Shocker: వృద్ధుడా..కామాంధుడా, వస్తువులు ఆశచూపి 4 రోజుల పాటు బాలికపై అత్యాచారం, కాలని వాసులు 100కు ఫోన్‌ చేయడంతో ఘటన వెలుగులోకి
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Warangal, Oct 20: తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చేసుకుంది. ఇంటి పక్కన ఉండే ఓ మైనర్‌ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిమళ కాలనీకి చెందిన బింగి భిక్షపతి విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.

ఇంటి వద్దే ఉంటున్న భిక్షపతి కన్ను.. ఇంటి పక్కనే 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై పడింది. ఎలాగైనా బాలికను లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలనుకుని.. ఆమెకు వివిధ రకాల వస్తువులు కొనిస్తూ తన వలలో వేసుకున్నాడు. నాలుగు రోజులుగా బాలికపై లైంగిక దాడికి (warangal retired employee molested minor girl) పాల్పడుతున్నాడు. అయితే భిక్షపతి ఇంటికి బాలిక వెళ్తుండటంతో ఆమె బంధువు గమనించింది. ఈ క్రమంలోనే విషయం ఆ నోటా.. ఈ నోటా కాలనీ అంతా పాకింది.

భర్త తనతో సెక్స్ చేయడం లేదని భార్య దారుణం, సలసల కాగే నూనె పైన పోసి ప్రతీకారం, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన భర్త, యూపిలో బారాబంకి జిల్లాలో ఘటన

దీంతో కాలనీవాసులు 100కు ఫోన్‌ చేయడంతో సంఘటన స్థలానికి స్థానిక ఎస్సైలు సతీష్‌కుమార్, సంపత్‌కుమార్‌ చేరుకున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగి భిక్షపతిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు.