UP Shocker: భర్త తనతో సెక్స్ చేయడం లేదని భార్య దారుణం, సలసల కాగే నూనె పైన పోసి ప్రతీకారం, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన భర్త, యూపిలో బారాబంకి జిల్లాలో ఘటన
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుమేహం బారిన పడటంతో భర్తలో లైంగిక సామర్థ్యం (impotent after having diabetes) తగ్గిపోయింది. దీంతో భార్య ప్రతిరోజూ భర్తతో గొడవపడుతూ... ఎందుకు పనికి రాకుండాపోయావని తిడుతూ ఉండేది. ఈ గొడవలు తీవ్రతరం కావడంతో భార్య అతనిపై సలసల కాగే నూనె (Wife pours boiling oil on husband in Barabanki) పోసింది.
Lucknow, Oct 20: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుమేహం బారిన పడటంతో భర్తలో లైంగిక సామర్థ్యం (impotent after having diabetes) తగ్గిపోయింది. దీంతో భార్య ప్రతిరోజూ భర్తతో గొడవపడుతూ... ఎందుకు పనికి రాకుండాపోయావని తిడుతూ ఉండేది. ఈ గొడవలు తీవ్రతరం కావడంతో భార్య అతనిపై సలసల కాగే నూనె (Wife pours boiling oil on husband in Barabanki) పోసింది.
అక్కడి స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..యూపీలో బారాబంకి జిల్లాలోని నగర్ కొత్వాలి పట్టణం సత్యప్రేమి నగర్‌కు చెందిన కౌశల్ కిషోర్ అనే 65 ఏళ్ల వ్యక్తి నాలుగేళ్ల క్రితం మధుమేహం బారిన పడ్డాడు. అప్పటినుంచి ఆయనలో లైంగిక శక్తి తగ్గుతూ వచ్చింది. దీంతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్తలో వచ్చిన మార్పు కారణంగా భార్య ప్రతిరోజూ గొడవపడేది. సరిగ్గా అన్నం కూడా వండి పెట్టేది కాదు. ఆయననే వంట చేసుకుని తినేవాడు. మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరూ గొడవపడ్డారు.
గొడవ పెద్దది కావడంతో రాత్రి భోజనం చేసే సమయంలో భార్య సలసల మరుగుతున్న నూనెను తీసుకువచ్చి భర్తపై పోసింది. ఈ ఘటనలో భర్త తల నుంచి కాలి వరకు వేడి నూనె పడడంతో వళ్లంతా కాలిపోయింది. ఆయన అరుపులు విని పక్కింటివాళ్లు పరుగెత్తుకొని వచ్చారు. పొరుగింటివాళ్లందరూ కలిసి కిషోర్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కిషోర్ మీడియాతో మాట్లాడుతూ తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారంతా పనుల నిమిత్తం వేరే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారన్నాడు. మధుమేహం కారణంగా తనలో లైగింక సామర్థ్యం తగ్గిపోయిందన్నాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా.. తన భార్య గొడవపడేదని, కొన్నిసార్లు కర్రలు, చెప్పులతో కూడా దాడి చేసిందని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా నూనెతోనే దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
(The above story first appeared on LatestLY on Oct 20, 2021 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

