Telangana Shocker: పుల్లుగా మందు తాగి కోరిక తీర్చాలంటూ అర్థరాత్రి యువతి ఇంటికి వెళ్లి వేధింపులు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపిన యువతి
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె.
Hyd, Mar 30: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి. మద్యం తాగి రాత్రి వేళ తరచూ సంగీత ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ పలుమార్లు సంగీతను బలవంతం చేశాడు.
ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది. దీంతో శీనును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు. ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది.
అనంతరం రాత్రి 2 గంటల తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై డి.రమేశ్ తెలిపారు.నిందితుడు రాంటెంకి శ్రీనివాస్ (25)కు ఇది వరకే వివాహమైంది. అయితే భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోవడంతో శ్రీనివాస్ ఒంటరిగా ఉంటున్నాడు.
(The above story first appeared on LatestLY on Mar 30, 2023 07:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

