stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Sep 29: తెలంగాణలో నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి (young woman gang-raped in Nizamabad ) పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం (gang-raped in Nizamabad) జరిగింది.

గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇక ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోల గంగుబాయి (18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్‌ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేరే యువతిని వివాహం చేసుకుంటానని రవీందర్‌ తెలపడంతో గంగుబాయి మనస్తాపం చెంది ఈనెల 24న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

యూట్యూబ్ వీడియో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకున్న బాలిక, చికిత్స పొందుతూ మృతి, తూర్పు గోదావరిలో విషాద ఘటన, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు

పెద్ద పల్లి జిల్లాలో ఇంకో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రేమికుడు మోసం చేసి మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓదెల గ్రామానికి చెందిన అల్లం ప్రసన్న (21) ప్రేమ విఫలమైనందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

పొత్కపల్లి ఎస్సై శీలం లక్ష్మణ్, ట్రెయినీ ఎస్సై వంశీకృష్ణరెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..ఓదెల గ్రామానికి చెందిన అల్లం రమేశ్‌–సంధ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు ప్రసన్న హన్మకొండలో ప్రయివేట్‌ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ప్రసన్న ఇదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన సందీప్‌ ఇటీవల వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

పెళ్లి పేరుతో పదే పదే యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్, ఆస్పత్రి పాలైన యువతి, నాగపూర్‌లో దారుణ ఘటన

విషయం తెలుసుకున్న ప్రసన్న కలతచెంది తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా చికిత్సకోసం కరీంనగర్‌ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతిచెందింది. ప్రసన్న మృతితో ఓదెలలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి తండ్రి అల్లం రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు. రాంనేని సందీప్‌ అతడి తల్లిదండ్రులు రాంనేని రాజు, రాజేశ్వరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్‌ పేర్కొన్నారు.