Maharashtra Shocker: పెళ్లి పేరుతో పదే పదే యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్, ఆస్పత్రి పాలైన యువతి, నాగపూర్‌లో దారుణ ఘటన
Representational Image (Photo Credits: File Image)

Mumbai, Sep 28: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లోనే ‍స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించింది. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే.. య‌శోధ‌ర న‌గ‌ర్‌కి చెందిన సోహెబ్ ఖాన్‌(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకుంటాన‌ని యువతిని న‌మ్మించి ఆమెపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

అయితే ఇటీవల తను గ‌ర్భం దాల్చడంతో విష‌యం తెలుసుకున్న ఖాన్‌ ఆమెను అబార్షన్‌ చేసుకోవాలని కోరాడు. ఇందుకు అబార్ష‌న్ ఎలా చేస్తారో, లేదా గ‌ర్భ‌స్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాల‌ని సోహెబ్ ఆమెకు సూచించాడు. అత‌ని బలవంతం మీద యూట్యూబ్ వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్ష‌న్‌కు య‌త్నించింది.

మహిళా పోలీస్ అధికారి స్నానం చేస్తుండగా వీడియో, రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్, పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

దీంతో ఆమెకు తీవ్ర ర‌క్తస్రావం కావ‌డంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సోహెబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.