Andhra Pradesh: యూట్యూబ్ వీడియో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకున్న బాలిక, చికిత్స పొందుతూ మృతి, తూర్పు గోదావరిలో విషాద ఘటన, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Representational Image (Photo Credits: ANI)

Amaravati, Sep 29: ఏపీలో తూర్పు గోదావరి ఘటనలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల గొడవల మధ్య ఓ బాలిక అద్దం ముక్కతో తన గొంతు కోసుకుని (13-year-old Girl slits throat) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కరోనాతో చనిపోవడంతో కొడుకు, కూతురుతో కలిసి ఆ బాలిక తల్లి అంబాజీపేట మండలంలోని పుట్టింటికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో అక్కడ కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పోలీసుస్టేషన్లో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ గొడవలన్నింటికీ కారణం తనేనని అందరూ నిందిస్తున్నారంటూ మనస్తాపం చెందిన బాలిక(13) సోమవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లి అద్దం ముక్కతో గొంతు కోసుకుని, అరుస్తూ బయటికొచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు అమలాపురంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పెళ్లి పేరుతో పదే పదే యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్, ఆస్పత్రి పాలైన యువతి, నాగపూర్‌లో దారుణ ఘటన

చనిపోవడానికి ముందు రోజు గొంతువద్ద చాకు, అద్దం, బ్లేడు దేనితో కోసుకుంటే ఎంత సేపటికి చనిపోతామని తనను అడగడంతోపాటు సామాజిక మాధ్యమంలో (watching suicide videos in East Godavari) చూస్తుండటంతో మందలించానని, ఇంతలోకే ఇలా చేసుకుందంటూ ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనాస్థలాన్ని సీఐ సురేష్‌బాబు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్‌ చెప్పారు.