 
                                                                 Hyd, August 9: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అప్పు కావాలని అడిగిన యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి (Youth Raped Junior artist) పాల్పడ్డాడు. ఈ ఘటన బంజార హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Banjara Hills PS) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది.
అయితే కామాంధుడుగా మారిన యువకుడు డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచి ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు.అనంతరం అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు.బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
