Telangana Top In Mutton Consumption: ముక్క లేనిదే ముద్ద దిగదు... మటన్ అత్యధికంగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. ఏడాది సగటున 21.17 కిలోల వినియోగం.. గత నాలుగేళ్లలో మాంసం కోసం రూ. 58,500 కోట్లు వెచ్చించిన జనం

తెలంగాణలో మటన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.

Telangana Top In Mutton Consumption: ముక్క లేనిదే ముద్ద దిగదు... మటన్ అత్యధికంగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. ఏడాది సగటున 21.17 కిలోల వినియోగం.. గత నాలుగేళ్లలో మాంసం కోసం రూ. 58,500 కోట్లు వెచ్చించిన జనం
Mutton (Credits: Twitter/ANI)

Hyderabad, Nov 27: తెలంగాణలో (Telangana) మటన్ (మేక మాంసం) (Mutton) వినియోగం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధికంగా మటన్ వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో (Top Place) నిలిచింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు (Sales) జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.

రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!

గత  నాలుగేళ్లలో అమ్ముడైన మాంసం ధర కిలోకు సగటున రూ. 600గా లెక్కిస్తే మొత్తంగా రూ. 58,500 కోట్లను మాంసం కోసం జనం వెచ్చించారు (Spends). ఇక, గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.90 లక్షలకు పైగా గొర్రెలు ఉన్నాయి. రాష్ట్రంలో 2015-16లో గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులుగా ఉండగా, 2020-21 నాటికి అది రెండింతలై 3.03 లక్షల టన్నులకు పెరిగింది.

తెలంగాణ చారిత్రక ఖ్యాతి విశ్వవ్యాపితం.. గోల్కొండ కోటలోని మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో అవార్డులు.. భారత్‌కు మొత్తం నాలుగు అవార్డులు..

ఈ ఏడాది అది 3.50 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇందుకోసం రూ. 31 వేల కోట్లకుపైగా సొమ్మును జనం వెచ్చించే అవకాశం ఉంది. దేశంలో గొర్రెలు, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలైతే తెలంగాణ అత్యధికంగా 21.17 కిలోలుగా ఉంది. గొర్రెల పంపిణీ పథకం వల్ల కొత్తగా రూ. 7,920 కోట్ల సంపదను సృష్టించినట్టు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య తెలిపింది.

(The above story first appeared on LatestLY on Nov 28, 2022 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).