Telangana Scores Double UNESCO Awards: తెలంగాణ చారిత్రక ఖ్యాతి విశ్వవ్యాపితం.. గోల్కొండ కోటలోని మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో అవార్డులు.. భారత్‌కు మొత్తం నాలుగు అవార్డులు..
తెలంగాణ చారిత్రక ఖ్యాతి మరోమారు విశ్వవ్యాపితం అయింది. రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.
Hyderabad, Nov 27: తెలంగాణ (Telangana) చారిత్రక ఖ్యాతి మరోమారు విశ్వవ్యాపితం అయింది. రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు (Historical Sites) యునెస్కో (Unesco) ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి (Golconda Metla bavi), కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట (Domakonda Kota) ఈ అవార్డులకు (Awards) ఎంపికయ్యాయి.
గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’ కేటగిరీలో, దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. అలాగే, ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ లభించగా, దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ లభించాయి.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. ఆ తర్వాత వర్షాలకు సగభాగం కూలిపోయింది. 2013లో ఈ బావి పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ చొరవతో పునరుద్ధణ జరిగింది. ప్రస్తుతం ఈ బావిలో ఊట వస్తోంది. దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇందులో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయం కూడా ఉంది.
(The above story first appeared on LatestLY on Nov 28, 2022 10:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

