Khammam Murder Case: అత్త రాసలీలలు, మద్యం మత్తులో అల్లుడు అది బయటపెట్టాడని కూతురితో కలిసి దారుణంగా చంపేసింది, ఖమ్మం మర్డర్ కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు

ఖమ్మంలో దారుణ హత్యకు గురైన ఎస్‌కే అన్వర్‌ హత్య కేసును (Khammam Murder Case) పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ (Revealed Police) వెల్లడించారు.

Khammam Murder Case: అత్త రాసలీలలు, మద్యం మత్తులో అల్లుడు అది బయటపెట్టాడని కూతురితో కలిసి దారుణంగా చంపేసింది, ఖమ్మం మర్డర్ కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు
Representational Image | (Photo Credits: IANS)

Khammam, Oct 10: ఖమ్మంలో దారుణ హత్యకు గురైన ఎస్‌కే అన్వర్‌ హత్య కేసును (Khammam Murder Case) పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ (Revealed Police) వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరం యూపీహెచ్‌ కాలనీలో నివాసముంటున్న ఎస్‌కే అన్వర్‌ (33) కొంతకాలంగా కనిపించడం లేదని అతడి తల్లి ఎస్‌కే రహమత్‌ ఈ ఏడాది జూలైలో ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

సీఐ రామకృష్ణ నేతృత్వంలో అన్వర్‌ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీపై నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నారు. భార్య సల్మా సొంతగ్రామమైన మహబూబాబాద్‌లో ఉంటోందని తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లభించలేదు. తర్వాత ఐడీ పార్టీ పోలీసుల ద్వారా నిఘా పెంచారు.

సర్పంచ్ కాదు కామాంధుడు, పుల్లుగా తాగి దారిన వెళుతున్న యువతిని మిద్దెమీదకు లాక్కెళ్లి అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన వికారాబాద్ పోలీసులు

ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడి, తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నిందితులు అన్వర్‌ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్, బాలాజీ, వెంకన్న లొంగిపోయారు. వారిని విచారించగా అన్వర్‌ను తామే హత్య (wife killed Husband with help mother) చేశామని అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు.

ఎందుకు చంపారంటే..

అన్వర్‌ మద్యానికి బానిస కావడంతో పాటు గంజాయికి అలవాటు పడి భార్యను నిత్యం అనుమానిస్తున్నాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. తాగి భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడు.ఇక అన్వర్‌ అత్త సాదుఖాన్‌ కూడా వీరి వద్దనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఆమెకు కొంతకాలంగా చింతకాని మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన అన్వర్‌ గతేడాది యూపీహెచ్‌కాలనీలో బాలాజీ బైక్‌ను తగలబెట్టడంతోపాటు బాలాజీని కత్తితో బెదిరించాడు.

దీనిపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో అన్వర్‌ను చంపాలని భార్య సల్మా, అత్త కలిసి నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్‌ 30వ తేదీన రాత్రి అన్వర్‌ చేతులు, కాళ్లు కట్టి అన్వర్‌ బావమరిది యాకూబ్‌ ఆటోలో బాలాజీ, చిర్రా వెంకన్న కలిసి తీసుకెళ్లి గోపాలపురం సమీపంలోని సాగర్‌ కాల్వలో పడేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారంతా భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అన్వర్‌ భార్య సల్మా, అత్త సాదుఖాన్, యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వివరించారు. అన్వర్‌ మృతదేహం ఆచూకీ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Oct 10, 2022 08:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).