Telangana Shocker: సిరిసిల్లలో ఘోర విషాదం, మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, మృతుల్లో 14 నెలల పసికందు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం.పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 30, 2023 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

