TRS Rajya Sabha Candidates: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ‍్యర్థుల ఖరారు, డా. బండి పార్థసారధి రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌ రావు పేర్లను ఫైనల్ చేసిన సీఎం కేసీఆర్

రాజ్యసభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ‍్యర్థులను (TRS Rajya Sabha candidates finalized) ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ అ‍భ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్‌ అధినేత డా. బండి పార్థసారధి రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ రావు (Parthasaradhi Reddy, Ravichandra, Damodar Rao) పేర్లను సీఎం కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు.

TRS Rajya Sabha Candidates: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ‍్యర్థుల ఖరారు, డా. బండి పార్థసారధి రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌ రావు పేర్లను ఫైనల్ చేసిన సీఎం కేసీఆర్
Parthasaradhi Reddy, Ravichandra, Damodar Rao are TRS candidates to Rajya Sabha (Photo-File Image)

Hyd, May 18: రాజ్యసభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ‍్యర్థులను (TRS Rajya Sabha candidates finalized) ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ అ‍భ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్‌ అధినేత డా. బండి పార్థసారధి రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ రావు (Parthasaradhi Reddy, Ravichandra, Damodar Rao) పేర్లను సీఎం కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్‌ నేత బండాప్రకాశ్‌ గతేడాది డిసెంబర్‌లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానంలో వీరిలో ఎవరి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

టీఆర్‌ఎస్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగుస్తుండటంతో.. ఆ స్థానంలో ఎన్నికలు (TRS candidates to Rajya Sabha) జరగనున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, నేపథ్యాలు ఇవే, బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక, విజయసాయి రెడ్డికి మరో అవకాశం..

మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీకాలం పూర్తవుతుండగా.. అందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్‌ 3న నామినేషన్ల ఉప సంహరణ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. ఒకరుకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే.. జూన్‌ 10న పోలింగ్‌ నిర్వహిస్తారు. టీఆర్‌ఎస్‌ నేత బండాప్రకాశ్‌ గతేడాది డిసెంబర్‌లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరుగుతోంది.

(The above story first appeared on LatestLY on May 18, 2022 05:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).