TS Covid Update: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా, తాజాగా 1,531 పాజిటివ్ కేసులు, ఆరుగురు మృతితో 1330కి చేరుకున్న మరణాల సంఖ్య
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 మందికి కరోనా వైరస్ (Telangana Coronavirus) నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి (Covid Deaths) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు.
Hyderabad, Oct 30: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 మందికి కరోనా వైరస్ (Telangana Coronavirus) నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి (Covid Deaths) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు.
దీంతో ఇప్పటివరకు కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,17,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది.
కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో 288, మేడ్చల్-మల్కాజిగిరిలో 118, రంగారెడ్డిలో 115, నల్లగొండలో 93, ఖమ్మంలో 84, భద్రాద్రి-కొత్తగూడెంలో 83 నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణపేటలో 2, కుమ్రంభీం-అసిఫాబాద్‌లో 3 కేసులు వచ్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అస్వస్థతకు గురవడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 30, 2020 11:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

