National Highway from TS to AP (Representational Image)

Hyd, Oct 24: తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం శుభవార్తను చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తిరుపతికి వచ్చే వారికి త్వరలో దూరం తగ్గిపోనుంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ (National Highway from TS to AP) ఇచ్చింది. కొత్తగా తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు (from Kalvakurthi in Telangana to Karivena in Andhra Pradesh) 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి తెలిపింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది. అలాగే ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది.

ఏపీలో మద్యం నిషేధం వైపు అడుగులు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ కొత్త జీవో తెచ్చిన ఏపీ ఎక్సైజ్‌ శాఖ, అక్రమ రవాణాను అరికట్టే దిశగా నిర్ణయం

కేంద్ర రవాణాశాఖ మంత్రిని సోమవారం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, నాగర్‌ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్‌ రావు, నాగర్‌ కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ నెడునూరి దిలీపాచారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు