TS SSC Advanced Supplementary Results 2024 Out: తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, ఫలితాలను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు వీటిని విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు
తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు వీటిని విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిల ఉత్తీర్ణత 71.01 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణత 76.37 శాతంగా నమోదైంది. అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఫలితాలను నేరుగా tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి
విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇక పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 51, 237 మంది విద్యార్థులు హాజరయ్యారు.
(The above story first appeared on LatestLY on Jun 28, 2024 04:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

