Instructions For Group 4 Exam: గ్రూప్‌ -4 పరీక్షలకు వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి, తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు!

గ్రూప్‌-4 పరీక్ష (Group 4 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్‌ ఉండగా.. ఈసారి థంబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి పరీక్షాకేంద్రంలో థంబ్‌ యంత్రాలను సిద్ధం చేశారు.

Instructions For Group 4 Exam: గ్రూప్‌ -4 పరీక్షలకు వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి, తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు!
Representational Image (Credits: Google)

Hyderabad, June 30: గ్రూప్‌-4 పరీక్ష (Group 4 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్‌ ఉండగా.. ఈసారి థంబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి పరీక్షాకేంద్రంలో థంబ్‌ యంత్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకుని.. వేలిముద్రల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ (TSPSC) సూచించింది. చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు పరీక్ష ముగిసిన తర్వాత వేలిముద్రలు స్వీకరిస్తామని పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ  (TSPSC) పోటీ పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్‌ విధానం ఒకటి. గతంలో ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశారు. ఎక్కువ సిరీస్‌లలో ప్రశ్నపత్రాలను ముద్రించారు. దీనివల్ల మాస్‌ కాపీయింగ్‌కు పూర్తిగా చెక్‌ పెట్టొచ్చు. అదేవిధంగా, బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయరు.

Outer Ring Rail: ఔటర్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు, సర్వేకోసం రూ.14 కోట్లు కేటాయింపు, తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్లాన్‌ 

గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్‌-1కు 9.45, పేపర్‌-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు (Instructions For Group 4 Exam). తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలిస్తారు. పరీక్ష సమయంలో అరగంటకు ఓ సారి గంట మోగిస్తూ అప్రమత్తం చేస్తారు.

Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన 

గ్రూప్‌-4కు తనిఖీలు ఇలా

1) గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్‌ను పరిశీలిస్తారు.

2) రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)

3) పరీక్ష కేంద్రంలో నామినల్‌ రోల్‌లోని పేరును పరిశీలిస్తారు.

4) నామినల్‌ రోల్‌, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.

5) అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.

6) చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.

తాళి, మెట్టెలు తీయాలనే ప్రచారం అవాస్తవం

గ్రూప్‌-4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. కొన్నిచోట్ల తాలుకా, మండల స్థాయిలోనూ పరీక్ష కేంద్రాలు ఉండటంతో బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. పరీక్ష ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షాసమావేశాలు నిర్వహించాం. సుమారు 40 వేలమంది ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పరీక్ష కేంద్రంలో విధులు, నిబంధనలు తదితర అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాం. ప్రతి పరీక్ష కేంద్రంలో యువతి, యువకుల కోసం ప్రత్యేకంగా చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేశాం. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించాం. అభ్యర్థులు రెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదు. హిందూ సంప్రదాయాలను కించ పరుస్తున్నారని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది.

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 09:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).