TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్, టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన, రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లోకి..
VC Sajjanar (Photo-Twitter)

Hyd, August 28: రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలో పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60ని, 30 కిలో మీటర్లు టి-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-9-60 టికెట్ ను రూ.100కు, టి-9-30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.

తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..

"రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టి-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.