Traffic Rules For Pedestrians: అజాగ్రత్తతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోకండి, పాదచారులు ఈ నిబంధనలు పాటించండి అంటూ వీడియోని షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్‌లో ఇటీవల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే. తొందరగా వెళ్లాలనే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే. తొందరగా వెళ్లాలనే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియోని షేర్ చేశారు. అలాగే నిబంధనలు పాటించండి అంటూ సూచనలు చేశారు.
నిబంధనలు ఇవిగో..
1. పాదచారులు ఫుట్‌పాత్‌లనే ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు.
2. జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి.
3. జీబ్రాలైన్ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు.
Here's Tweet
హైదరాబాద్‌లో ఇటీవల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే. తొందరగా వెళ్లాలనే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
*పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి*
1.… pic.twitter.com/93t4lAqqNo
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 26, 2023
4. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలి.
5. సెల్‌ఫోన్, హియర్ ఫోన్స్ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్ వినపడదు.
6. రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
7. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలి.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 09:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

