Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)

శుక్రవారం తెల్లవారుజాము సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతంలో కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది.

Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)
Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

Medak, Jan 31: శుక్రవారం తెల్లవారుజామున మెదక్ (Medak) జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతం (Valluru forest area)లో కేంద్ర నర్సరీ సమీపంలో ఘోరం జరిగింది. 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో చిరుత తీవ్రంగా గాయపడింది. అనంతరం గాయాలపాలైన చిరుత రోడ్డుపక్కకు వెళ్లిపోయింది. కాసేపటికి తేరుకున్న చిరుత.. తన నైజాన్ని మరిచిపోకుండా అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసేందుకు మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. అయితే చిరుత దాడి నుంచి సదరు వ్యక్తి తప్పించుకున్నాడు.

యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు 

Here's Video:

అదే సమయంలో మరో వాహనం

అదే సమయంలో భారీ వాహనం మరొకటి ఢీకొట్టడంతో చిరుత ఎగిరి రోడ్డుపక్కన పడిపోయింది. వాహనం బలంగా ఢీకొట్టడంతో దాని పొట్టపగిలి పేగులు బయటకు వచ్చాయి. దీంతో గిలగిలాడుతూ ఆ చిరుత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత వయసు రెండున్నరేళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

శిలాతోరణం వద్ద..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో శిలాతోరణం సర్కిల్‌ లోని ఓ కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం కొండపై చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 09:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).