Warangal Horror: వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు
వరంగల్‌లో (Warangal) ఘోరం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ (Driver) సహా అతడి మిత్రులు అత్యాచారానికి ఒడిగట్టారు.
Warangal, April 30: వరంగల్‌లో (Warangal) ఘోరం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ (Driver) సహా అతడి మిత్రులు అత్యాచారానికి ఒడిగట్టారు. అసలేం జరిగిందంటే.. హనుమకొండ (Hanamkonda) నయీంనగర్ సమీపంలో నివసించే వివాహిత ఈ నెల 27న పనిపై బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కేయూ క్రాస్ వద్ద ఆటోను ఆపి రంగ్‌బార్ వద్ద దింపాలని కోరింది. సరేనని ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్ తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీశ్‌కు ఫోన్ చేశాడు. వారొచ్చి ఆటో ఎక్కగానే ఆటోను ముందుకు పోనిచ్చాడు.
చెప్పిన చోటుకు కాకుండా..
అయితే, ఆటో ఆమె చెప్పిన చోటుకు కాకుండా భీమారం వైపు వెళ్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించి అరవడంతో రాకేశ్ స్నేహితులు ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆటోలోని సౌండ్ బాక్స్ సౌండ్ పెంచి ఆటోలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె చెప్పిన రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
(The above story first appeared on LatestLY on Apr 30, 2023 08:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

